song 4 ఆదియు అంతము
ఆదియు అంతము నీవేనని
భూలోకం పరలోకం నీదేనని
ఆనందం ఆభరణం నీవేనని
శాంతియు సంపద నీదేనని
నిండు బలముతో సేవించెద నిండు ప్రేమతో కొనియాడెదా యేసయ్య (2)
కృపయు కనికరం చూపెదవని
ఆలోచన ఆదరణ ఇచ్చెదవని
మహిమతో మేలుతో నింపెదవని
మరువని విడువని దేవుడవని
నిండు మనస్సుతో ఆరాధించెద నిండు మనస్సుతో స్తుతించెద (2)
ప్రాణం పెట్టిన ప్రియుడవని
ప్రేమించిన దైవం నీవేనని
నిత్యత్వం అమరత్వం ఇస్తావని
అతిశయం అధికారం నీయందేనని
నీ ప్రేమనే స్మరించెద నీ త్యాగాన్నే ప్రకటించెద (2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమెన్
Comments
Post a Comment