"ఇదే నిజమైన ప్రేమ"
యోహను3:16 దేవుడు మనలను ఎంతగానొప్రేమించాడు ప్రేమించిన ఆయన ఆ ప్రేమను ఎలా చూపాడు? మనము స్వార్ధపురితమైన ఈ జీవితంలో ఎన్నోపాపలు చేస్తూ కాలం గడుపుతు దేవుని ఉగ్రతకు పాత్రులమైన మనలను తన యొద్దకు చెర్చుకొనుటకు మనకు పరలోకాన్ని అనుగ్రహించుటకును మనకు పాప వీమోచనము కలుగుటకు ఆయన తన అద్వితియకుమారుని ఈ లోకానికి పంపాడు. ఈ లోకానికి వచ్చిన క్రీస్తు మనకు ఎన్నో భొధలు చేసి ఆ భొధలో దేవుని ప్రేమను చూపాడు. బైబిల్ లో మనము చూసి నట్లైతె ఎవరిని ఎలా ప్రేమించాలి అని క్రీస్తు పలికిన మాటలను పరిశిలించి నట్లైతే..... 1. శత్రువును ప్రేమించుడి:
మత్తయి 5:43-45: ఇక్కడ క్రీస్తు పలికిన మాటలో నీ శత్రువులను ప్రేమించుడి, ప్రేమించడమే కాదు గాని వారికొరకు ప్రార్ధన చేయుడి... అని పలికిన క్రీస్తు మాటలోని భావము ప్రేమను పెంచేదిగా ఉంది. ఇలా మనము శత్రువులను ప్రేమించిన యెడల పరలోకమందు దేవునికి కుమారులుగా ఉంటాము. 2. నిస్వార్ధమైన ప్రేమ:
1కొరింధీ 12:4-8: మనకి పరలోకమందు ఉన్న తండ్రి ఒక్కడే, ఆయన ప్రేమామయుడు అలాగే క్రీస్తు మరియూ పరిషుద్దాత్మ కూడా ప్రేమమయులే.... అలాగే మనము కూడా పరిషుద్దాత్మను పొందుకున్నవారము గనుక ప్రేమామయులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. 3. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు:
మార్కు 12:31 నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలి.... దీనికంటే ముక్యమైన ఆఙ్ఞా మరొకటి లేదు.. అని క్రీస్తు పలికాడు నిన్ను నీవే ఎంతగా ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగువానిని కూడా ప్రేమించాలి... 4. ఒకరినొకరు ప్రేమింపవలెను:
యోహాను 13:34,35 మిమ్మును మీరు ఎంతగా ప్రేమించుకుంటారో అదే రీతిగా మీరు సంఘములో ఒకరినొకరు ప్రేమింపవలెను... ఇలా మనము ప్రేమ కలిగి యున్న యెడల మనము క్రీస్తును పోలి నడుచుకొని ఆయనకు శిష్యులమగుదుము.. 5. దేవుని ఆఙ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట:
1యోహాను 5:3: దేవుని ప్రేమించడం అంటే దేవుడు మనకు ఇచ్చిన ఆఙ్ఞలను తెలుసుకొని వాటిని పాటించినప్పుడే దేవుని ప్రేమించినట్టు.. దేవుడు మనకు బారమైన ఆఙ్ఞలను ఇవ్వలేదు 6. ప్రేమ అనేక పాపములను కప్పును:
1పేతురు 4:8: మనము మిక్కటమైన ప్రేమగలవారమై యుండాలి ఈ ప్రేమా అనేకపాపములను కప్పును గనుక ప్రతి సంఘములో అంధరిలో ఇలాంటిప్రేమను కలిగి యుండాలి. 7. నిజమైన స్నేహితుని ప్రేమ:
సామెతలు 17:17 మనము ఈన్నో బాదలలో కష్టాలలో సమస్యల లో చిక్కుకున్నప్పుడు మనలను విడువని వాడే నిజమైన స్నేహితుడు అతడు నిస్వార్ధమైన ప్రేమకలిగిన వాడు. ఇలాంటి వాడు మనము సమస్యలలో ఉన్నప్పుడు సహోదరుడుగా ఉంటాడు. 8. వివాహిత ప్రేమ:
ఆదికాండము 29:20 యాకోబు రాహేలుని ప్రేమించి ఆమెను పెండ్లి చేసుకొనుటకు 7సం||లు కొలువు చేసాడు కాని అతడు అమేను ప్రేమించుటవలన కొద్దిదినములుగా తోచెను. పైన వ్రాయబడిన ఇలాంటి ప్రేమ ప్రతి సంఘములో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు..
సంఘమును క్రీస్తూ తన స్వరక్తముతో సంపాదించుకున్నాడు... ఆసంఘమును క్రీస్తు ప్రేమించాడు... ప్రేమించిన ఆయన సంఘమును ఎలా చూడాలి అని కరుకుంటున్నాడో చూద్దాం
ఎఫెస్సి 5: 25-28 నిష్కళంకమైనదిగాను, పరిశుద్దమైనదిగాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘముగాను ఉండాలి అని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి..పరిశుద్దపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను... సంఘమును ప్రేమించిన క్రీస్తు మన కొరకు బలియైనాడు... ప్రేమలో త్యాగము ఉంది గనుక క్రీస్తును ధరించుకొనిన నీవు నీపొరుగువాని కొరకు ప్రాణము పెట్టబద్దుడవైయున్నావు.... "ఇదే నిజమైన ప్రేమ"
- Naveen Didla
Comments
Post a Comment