Song 1- యెహోవా యే నా
యెహోవా యే నా కాపరిగా -ఆయనె నా సహకారిగా
నే చేయగలను సమస్తము - నే పొందెదను విజయమును
1. యెహోవా యే నా దీపముగా -ఆయనె నా మార్గముగా
నే నడిచెదను సదాకాలము - నే పొందెదను సర్వలోకమును
2. యెహోవా యే నా దేవునిగా - ఆయనే నా ప్రభువునిగా
నే ఆరాధింతును ఎల్లాకాలము - నే పొందెదను పరలోకమును
3. యెహోవాను ఘనపరచగా ఆయననే హెచ్చింపగా
నే ప్రార్దింతును అన్నివేళలా - నే ప్రేమింతును సమస్తమును
Comments
Post a Comment