సిలువ పై యేసు పలికిన మాటలకి వివరణ
సిలువ పై యేసు పలికిన మాటలకి వివరణ :
1. మొదటి మాట: తన తండ్రి యెహోవాతో
తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. (లూకా 23:34)
క్షమాపణ ని సూచిస్తుంది.
ఆ మాట పలికిన సమయం లో ఎందరో సైనికులు, సేనాధిపతులు, పరిసయ్యులు, సద్ధుకయ్యలు ఉన్నరు. వీరంతా లోకస్తులకి సాదృశ్యం. వాళ్ళు మాటలతో యేసు ని దూషిస్తున్నారు, హేళన చేస్తున్నారు అయినప్పటకి యేసు వారిని క్షమించమని తండ్రి అయిన యెహోవ కు విజ్ఞాపన చేస్తున్నారు. మనం కూడా యేసు వలే మనల్ని దూషించిన వారి కోసం, అవమాన పరిచిన వారి కోసం ప్రార్ధించాలి అని నేర్పించటానికి యేసు ఈ మాట పలికెను. క్షమాపణ యేసు మాత్రమే చూపిన గుణం . అది మనం కలిగి ఉండాలి.
1. మొదటి మాట: తన తండ్రి యెహోవాతో
తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. (లూకా 23:34)
క్షమాపణ ని సూచిస్తుంది.
ఆ మాట పలికిన సమయం లో ఎందరో సైనికులు, సేనాధిపతులు, పరిసయ్యులు, సద్ధుకయ్యలు ఉన్నరు. వీరంతా లోకస్తులకి సాదృశ్యం. వాళ్ళు మాటలతో యేసు ని దూషిస్తున్నారు, హేళన చేస్తున్నారు అయినప్పటకి యేసు వారిని క్షమించమని తండ్రి అయిన యెహోవ కు విజ్ఞాపన చేస్తున్నారు. మనం కూడా యేసు వలే మనల్ని దూషించిన వారి కోసం, అవమాన పరిచిన వారి కోసం ప్రార్ధించాలి అని నేర్పించటానికి యేసు ఈ మాట పలికెను. క్షమాపణ యేసు మాత్రమే చూపిన గుణం . అది మనం కలిగి ఉండాలి.
2. రెండవ మాట :
నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండుదువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. (లూకా 23:43)
రక్షణ కి సాదృశ్యం.
ఈ మాట సిలువ లో యేసు కి ఎడమ వైపు ఉన్న దొంగ తో చెప్తున్న మాట. ఆ దొంగ యేసు ని దేవుడు అని విశ్వసించాడు. తను చేసిన పాపానికి తానికి పడిన శిక్ష సబబే అని తలచాడు . పాపాన్ని ఒప్పుకున్నాడు . కనుక యేసు ప్రభువు నీవు పరదేశి లో ఉంటావని చెప్పారు. దీనిని బట్టి మనం పాపులం అని తెలుసు కొని, పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని, దేవుని అందు విశ్వాసం తో జీవించిన యెడల పరదేశి లో మనకి స్థానం ఉందని, యేసు చెప్తున్నారు అది నిశ్చయంగా. రక్షణ యేసు చేసిన సిలువ త్యాగం ద్వార తప్ప దేని వాళ్ళ కాదని గ్రహించాలి.
3. మూడోవ మాట : అమ్మా, ఇదిగో నీ కుమారుడు (యోహానును చూపిస్తూ) ఇదిగో, నీ తల్లి (మరియను చూపిస్తూ) (యోహాను 19:26-27)
బాధ్యత కి సాదృశ్యం. యేసు తన తల్లి భాద్యతను శిష్యునికి అప్పచేప్తున్నాడు. అంత వేదన లో కూడా తల్లిని గురించి యేసు ఆలోచించారు. కుటుంబ భాద్యతను మరిచిపోలేదు. తల్లి తండ్రులని ఆదరించకుండా, చీధరించుకుంటూ ఒంటరి గా వదిలేస్తున్న సమాజం లో ఉన్నాం . కాని తన బిడ్డలమయిన మనం మన తల్లి తండ్రుల పట్ల మన చివరి శ్వాస వరకు కూడా భాద్యత, ప్రేమ కనపరచాలని యేసు కోరుకుంటున్నాడు. కనుక మనకి మాదిరి గా ఈ మాట ను పలికారు.
4. నాల్గవ మాట: ఎలోయీ ఎలోయీ సబక్తానీ (నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి) మత్తయి (27:46) మార్కు (15:34)
ఒంటరితనం లో కూడా పోరాటానికి సాదృశ్యం.
తండ్రి అయిన యెహోవ తో యేసు పలికిన మాట, నా దేవా, నా దేవా నేన్నేందుకు చేయి విదిచితివి ... ఈ మాట ఒక్కసారి గమనించండి యేసు ప్రభువు నన్ను కాపాడు ప్రభువా అని ఆర్జించలేదు. అబ్రహాము తన బిడ్డని బలి పశువు గా చేసినప్పుడు తప్పించిన తండ్రి, యేసు ని ఈ భాధ నుండి తప్పించలేడా ? తప్పించగలడు, విదిపించగలడు . కాని మన పాప క్షమాపణ కోసం తన ప్రియ కుమారుడిని సిలువ పై చేయి విడిచాడు తండ్రి అయిన దేవుడు. యేసు కి తెలుసు తన తండ్రి చిత్తం నెరవేరాలంటే తప్పక ఈ సిలువ కార్యం జరగాలని. అందుకే కాపాడమని అడగలేదు. దేవుడు తన చేయి విడిచాడు, తన శిష్యులు చేయి విడిచారు కాని యేసు తను ఈ లోకానికి వచ్చిన కార్యం కోసం వేదన, చింత, ఒంటరితనం, దేనిని లెక్క చేయక భాదని ఓర్చుకుని, శ్రమను సహించాడు. మనం కూడా దేవుడు కార్యాలలో వెళ్తున్నప్పుడు శ్రమలు, ఒంటరి తనం, చింత, శ్రమ ఇలా ఎన్నో ఆటంకాలు కాని దేవుని కార్యం జరిగించాలనే గమ్యం మనల్ని నడిపించాలని దేవుడు ఈ మాట ద్వార చెప్తున్నారు.
5. ఐదవ మాట : నేను దప్పిగొనుచున్నాను. (యోహాను 19:28)
ధప్పిగొనుచున్నాడు యేసు. ప్రవచనం నెరవేర్చటం కోసం ఈ మాట పలికేనని చెప్తారు. దీనితో పాటు ఇంకొక విషయం అర్ధం చెసుకొవలి. ఆత్మల దాహం వేస్తుందట యేసయ్య కి. తన సిలువ కార్యం జరిగే వరకు సంపూర్ణ విశ్వాసం కనపరచలేదు శిష్యులు . సిలువ త్యాగం, మరణ పునరుద్ధానం తరువాతే సంపూర్ణంగా శిష్యులు విశ్వసించారు. ఆ దప్పిక మనం కలిగి ఉండాలి, దేవుని కొరకు ఆత్మ లు సంపాదించాలనే ఉద్దేశం తో ఈ మాట పలికారు. ఒక మానవుని గా యేసు దప్పిగా అని అడిగెను ధహమని, చిరక ఇచ్చిన జనాంగం అంటే సంపూర్ణ విశ్వాసం లేని ఆత్మలు సంపాదించలేని వారు దేవునికి చిరక ఇచ్చిన వారే అని గ్రహించలి.
6. ఆరవ మాట : ఇక సమాప్తమయినది (యోహాను 19:30)
జీవితం సంపూర్ణత కి సాదృశ్యం.
యేసు తన శరీరం లో అవయలాం అయిన మన కోసం మన పాప క్షమాపణ కొరకు తన శరీరాన్ని తూట్లు, తూట్లు గ చీల్చనిచ్చారు. ఆకరి బొట్టు వరకు రక్తం కార్చి తండ్రి చితాన్ని నెరవేర్చాడు. తను లోకానికి వచ్చిన పని పూర్తి అయినదని నమ్మకం గా చెప్పగలిగాడు. మనం మన దేవుడు ఇచ్చిన పని ని సంపూర్ణంగా నేరవేర్చినప్పుడే మనం ఈ మాట చెప్పగలం. అది ఎంత కష్టమైన, శిక్ష అయిన, వేదన అయిన, సంపూర్ణంగా లోబడి పని ని పూర్తి చేయాలనీ దేవుడు చెప్తున్నా మాట ఇది.
7. ఎడవ మాట : తండ్రీ నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను (లూకా 23:46)
తండ్రి అయిన దేవుని తో చెప్తున్నా మాట. ఆత్మను దేవునికి అప్పచేప్తున్నారు, శరీరాన్ని జయించెను కనుక ఆత్మను దేవుని చేతికి ఇచ్చారు. మనం కూడా శరీర ఆసను జయించినప్పుడు, లోకాన్ని జయిస్తాం. ఇక దేవుని తో మన ఆత్మ కలుస్తుంది. కావున మనం లోకాసను విడిచిపెట్టి దేవుని కి ఆత్మను అప్పచేప్పాలని దేవుడు చెప్తున్నారు.
ప్రతి మాట లో ను ప్రతి కార్యం లో ను మనకి మాదిరి గ ఉండటానికి మనకి మాదిరి చూపించటానికి యేసు క్రీస్తు ఈ భూమి మీద మనవ జీవితం జీవించారు. సిలువ లో మన పాప ప్రక్షాళన నిమితం బాలి అయ్యారు అనే సత్యాన్ని గమనించి ఆయన చూపిన మార్గం లో జీవించాలని ఆ త్యాగాన్ని మరొక సారి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను.
All Glory to God
Comments
Post a Comment