song 2 - నా హృదయమే

నా హృదయమే నీకు కోవెలగా 
నా దేహమే నీకు ఆలయముగా


నన్నే మార్చుకో యేసు - నన్నే మలచుకో
1. చెలిమే లేని నాకు కలిమే నీవై
    బలమే లేని నాకు బలగమే నీవై
    నాతో ఉండిపో యేసు - నాలో నిండిపో ( నా హృదయమే)
2. భాగ్యమే లేని నాకు బంగారమే నీవై
     సౌఖ్యమే లేని నాకు సంపద నీవై
     నాతో నిలిచిపో యేసు - నీలో నింపుకో( నా హృదయమే)
3. మమతలే లేని నాకు మహిమే నీవై
    మాటలే లేని నాకు స్వరమే నీవై
    నన్నే చేర్చుకో యేసు - నీలో కలుపుకో( నా హృదయమే)
4. ఆశయే లేని నాకు చిగురాశే నీవై
     దిశయే లేని నాకు గమ్యమే నీవై
     నీవే నడుపుకో యేసు - నీతో చేర్చుకో( నా హృదయమే)

Comments

Popular posts from this blog

సిలువ పై యేసు పలికిన మాటలకి వివరణ

"ఇదే నిజమైన ప్రేమ"

ప్రేమ