నీ సామాగ్రి ఏది?
యిర్మీయా 10 : 17 - నివాసినీ, ముట్టడివేయబడుచున్న దేశము విడిచి వెళ్లు టకై నీ సామగ్రిని కూర్చుకొనుము. ఈ వాక్యం రాకడ గురించి చెప్పబడినట్టు ఉంది. దేశం అనగా లోోకం , సామాగ్రి కూర్చుకోవాలి అనేదే అంశం ఈ లోకంలో కొందరు ధనం కూర్చకుంటున్నారు (మత్తఇ 6:19) ఈలోకంలో ధనం కూర్చుకొనవద్దు కొందరు పాపమునకు పాపం కూర్చకుంటున్నారు (యెషయా 30:1) ఇంకొందరు సంపద కూర్చుకుంటున్నారు అవి వ్యర్దం (2:8-11) మరి ఏమి కుర్చకోవాలి? 1. వాక్యం - మనం ఆరవ దినం లో ఉన్నాం నిర్గమ 16:5,25 లో ఏడవ దినం విశ్రాంతి దినము కావున ఆరవ దినము నే మన్నా ను రెండింతలుగా కూర్చుకోమన్నారు. ఏడవ దినం లో అది వెదకిన దొరకదు. మన్నా అనగా వాక్యం 2. దయ - పరిశుద్దాత్ముని దయ పొందుకున్నప్పుడే ప్రభువు కటాక్షం పొందుతాం( రూతు 2:7,ఎస్తేరు 2:9)కీర్తనలు 104:27,28) 3. ఙానం - సామెతలు 10:14 పరిశుద్దులు సంపూర్ణ పరిశుద్దులు అగుటకు ఙానులు ఙానమును కూర్చకుంటటున్నారు. ఙానము దేవుని నుండి కలుగును. ఆయన మార్గం మనకు తెలియపరచును.