Posts

మట్టి పడవ

Image
దేవదేవుని మహాస్వరం ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు గొంతులో ఈ లోకంలో ప్రతిధ్వనించింది. గొర్రెలు తమ కాపరి స్వరాన్ని గుర్తించినట్టే, విశ్వాసులు కూడా తన స్వరాన్ని గుర్తిస్తారని ప్రభువు చెప్పాడు (యోహాను 10:4). పది నెలల పసిపాప కూడా ఎంతమందిలోనైనా తన తల్లిదండ్రుల స్వరాన్ని గుర్తించి వారివైపు తన చేతులు చాపుతుంది. ప్రతిరోజూ వింటున్న ఆ స్వరాలు ఆమెకు సుపరిచితమవుతాయి. లోకం తాలూకు రణగొణ ధ్వనులు, కీచులాటలు, వాగ్వాదాలు, శబ్దాలహోరులో దేవుని మృదువైన స్వరం మనిషి చెవులకు సోకడం కొంత కష్టమే! అయితే దేవునితో చేసే నిరంతర సహవాసంలో ఆయన స్వరం సుపరిచితమవుతుంది. కాపరి తన గొర్రెలను మేపుతాడు, దారి చూపిస్తాడు. క్రూర మృగాల నుండి వాటిని కాపాడుతాడు.తిరుగుబాటుతత్వం, చపలత్వం, అవిధేయతతో నిండిన మనిషికి కూడా దేవునితో పోటీ, మార్గదర్శకత్వం, భద్రత, క్షమాపణ, దొరుకుతాయి.    అంతరిక్షాన్నే గెలిచినవారు అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడం, నన్ను నేను సంస్మరించుకోవడం ఒక లెక్కా! అన్నది మనిషి ధీమా. అయితే అది మట్టి పడవలో అవతలి తీరానికి చేరాలనుకోవడమే! తనను తాను కాపాడుకోలేని మట్టి పడవ మనల్ని గమ్యం చేర్చుతుందా? ఎంతసేపు ‘అపరిశుద్ధ

నీ సామాగ్రి ఏది?

Image
యిర్మీయా 10 : 17 - నివాసినీ, ముట్టడివేయబడుచున్న దేశము విడిచి వెళ్లు టకై నీ సామగ్రిని కూర్చుకొనుము. ఈ వాక్యం రాకడ గురించి చెప్పబడినట్టు ఉంది. దేశం అనగా లోోకం , సామాగ్రి కూర్చుకోవాలి అనేదే అంశం ఈ లోకంలో కొందరు ధనం కూర్చకుంటున్నారు (మత్తఇ 6:19) ఈలోకంలో ధనం కూర్చుకొనవద్దు కొందరు పాపమునకు పాపం కూర్చకుంటున్నారు (యెషయా 30:1) ఇంకొందరు సంపద కూర్చుకుంటున్నారు  అవి వ్యర్దం (2:8-11) మరి ఏమి కుర్చకోవాలి? 1. వాక్యం - మనం ఆరవ  దినం లో ఉన్నాం నిర్గమ 16:5,25 లో ఏడవ దినం విశ్రాంతి దినము కావున ఆరవ దినము నే మన్నా ను రెండింతలుగా కూర్చుకోమన్నారు. ఏడవ దినం లో అది వెదకిన దొరకదు. మన్నా అనగా వాక్యం 2. దయ - పరిశుద్దాత్ముని దయ పొందుకున్నప్పుడే ప్రభువు కటాక్షం పొందుతాం( రూతు 2:7,ఎస్తేరు 2:9)కీర్తనలు 104:27,28) 3.  ఙానం - సామెతలు 10:14 పరిశుద్దులు సంపూర్ణ పరిశుద్దులు అగుటకు ఙానులు ఙానమును కూర్చకుంటటున్నారు. ఙానము దేవుని నుండి కలుగును. ఆయన మార్గం మనకు తెలియపరచును.

స్తోత్రం

Image
ప్రాణం పెట్టిన ప్రియుని ప్రేమించటం కన్న , మరణాన్ని జయంచిన నాధుని మనస్సు న నిలపటం కన్న  , జీవితం లో ఇంత కన్న ధన్యత ఉందా? మాటల్లో వివరించలేని మధురమైన నీ ప్రేమ తలచిన.... ఎంత దీన స్ధితి నాది ఐన నన్ను ఆదరించి అక్కున చేర్చుకున్న నీకు మనసార కృతజ్ఞతలు. ఒకమారు నేను మరచిన నన్ను మరువని ఎడబాయని నీ ప్రేమకు నా జీవితం అంకితం.  ప్రేమ కి అర్ధం చెప్పి ఇదిగో నా ప్రేమ అని సిలువ లో నువ్వు చుాపిన ప్రేమ మహనీయం. అద్భుతం అమరం అనిర్వచనీయం నీ ప్రేమ యేసయ్య!!!!

song 4 ఆదియు అంతము

Image
ఆదియు అంతము నీవేనని భూలోకం పరలోకం నీదేనని ఆనందం ఆభరణం నీవేనని శాంతియు సంపద నీదేనని నిండు బలముతో సేవించెద నిండు ప్రేమతో కొనియాడెదా యేసయ్య  (2) కృపయు కనికరం చూపెదవని ఆలోచన ఆదరణ ఇచ్చెదవని మహిమతో మేలుతో నింపెదవని మరువని విడువని దేవుడవని నిండు మనస్సుతో ఆరాధించెద నిండు మనస్సుతో స్తుతించెద (2) ప్రాణం పెట్టిన ప్రియుడవని ప్రేమించిన దైవం నీవేనని నిత్యత్వం అమరత్వం ఇస్తావని అతిశయం అధికారం నీయందేనని నీ ప్రేమనే స్మరించెద నీ త్యాగాన్నే ప్రకటించెద (2) హల్లెలూయ   హల్లెలూయ  హల్లెలూయ ఆమెన్

Song 1- యెహోవా యే నా

Image
యెహోవా యే నా కాపరిగా -ఆయనె నా సహకారిగా నే చేయగలను సమస్తము - నే పొందెదను విజయమును 1. యెహోవా యే నా దీపముగా -ఆయనె నా మార్గముగా నే నడిచెదను సదాకాలము - నే పొందెదను సర్వలోకమును 2. యెహోవా యే నా దేవునిగా - ఆయనే నా ప్రభువునిగా నే ఆరాధింతును ఎల్లాకాలము - నే పొందెదను పరలోకమును 3. యెహోవాను ఘనపరచగా ఆయననే హెచ్చింపగా నే ప్రార్దింతును అన్నివేళలా - నే ప్రేమింతును సమస్తమును

song 3 - ఏమివ్వగలనయ్య

Image
ఏమివ్వగలనయ్య నా ప్రియుడ యేసయ్య ఏమిచేయగలనయ్య నా మంచి మెసయ్య నీవు చూపినా ప్రేమకై - నీవు చేసినా త్యాగముకైై 1. ప్రశ్నలే లేవయ్య - ప్రతిఫలం కోరలేదయ్య నీవు చేసినా మేలులకై - నీవు పొందినా దెబ్బలకై 2. వర్ణనే లేదయ్య - విలువ కట్టలేనయ్య (2) నీవు పడినా భాథకై - నీవు కార్చినా రక్తముకై 3. భారమైన సిలువయ్య - భరిఇంచినావయ్య (2) నీవు కోరినా నాకై - నీవు చేసినా నా కొరకై 4. సర్వమే నీవయ్య - సర్వస్వమేసయ్య (2) నీవు పిలిచినా పిలుపుకై - నీవు కృపకై ( ఏమివ్వగలనయ్య)

song 2 - నా హృదయమే

Image
నా హృదయమే నీకు కోవెలగా  నా దేహమే నీకు ఆలయముగా నన్నే మార్చుకో యేసు - నన్నే మలచుకో 1. చెలిమే లేని నాకు కలిమే నీవై     బలమే లేని నాకు బలగమే నీవై     నాతో ఉండిపో యేసు - నాలో నిండిపో ( నా హృదయమే) 2. భాగ్యమే లేని నాకు బంగారమే నీవై      సౌఖ్యమే లేని నాకు సంపద నీవై      నాతో నిలిచిపో యేసు - నీలో నింపుకో( నా హృదయమే) 3. మమతలే లేని నాకు మహిమే నీవై     మాటలే లేని నాకు స్వరమే నీవై     నన్నే చేర్చుకో యేసు - నీలో కలుపుకో( నా హృదయమే) 4. ఆశయే లేని నాకు చిగురాశే నీవై      దిశయే లేని నాకు గమ్యమే నీవై      నీవే నడుపుకో యేసు - నీతో చేర్చుకో( నా హృ దయమే)