సిలువ పై యేసు పలికిన మాటలకి వివరణ : 1. మొదటి మాట: తన తండ్రి యెహోవాతో తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. (లూకా 23:34) క్షమాపణ ని సూచిస్తుంది. ఆ మాట పలికిన సమయం లో ఎందరో సైనికులు, సేనాధిపతులు, పరిసయ్యులు, సద్ధుకయ్యలు ఉన్నరు. వీరంతా లోకస్తులకి సాదృశ్యం. వాళ్ళు మాటలతో యేసు ని దూషిస్తున్నారు, హేళన చేస్తున్నారు అయినప్పటకి యేసు వారిని క్షమించమని తండ్రి అయిన యెహోవ కు విజ్ఞాపన చేస్తున్నారు. మనం కూడా యేసు వలే మనల్ని దూషించిన వారి కోసం, అవమాన పరిచిన వారి కోసం ప్రార్ధించాలి అని నేర్పించటానికి యేసు ఈ మాట పలికెను. క్షమాపణ యేసు మాత్రమే చూపిన గుణం . అది మనం కలిగి ఉండాలి. 2. రెండవ మాట : నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండుదువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. (లూకా 23:43) రక్షణ కి సాదృశ్యం. ఈ మాట సిలువ లో యేసు కి ఎడమ వైపు ఉన్న దొంగ తో చెప్తున్న మాట. ఆ దొంగ యేసు ని దేవుడు అని విశ్వసించాడు. తను చేసిన పాపానికి తానికి పడిన శిక్ష సబబే అని తలచాడు . పాపాన్ని ఒప్పుకున్నాడు . కనుక యేసు ప్రభువు నీవు పరదేశి లో ఉంటావని ...
యోహను3:16 దేవుడు మనలను ఎంతగానొప్రేమించాడు ప్రేమించిన ఆయన ఆ ప్రేమను ఎలా చూపాడు? మనము స్వార్ధపురితమైన ఈ జీవితంలో ఎన్నోపాపలు చేస్తూ కాలం గడుపుతు దేవుని ఉగ్రతకు పాత్రులమైన మనలను తన యొద్దకు చెర్చుకొనుటకు మనకు పరలోకాన్ని అనుగ్రహించుటకును మనకు పాప వీమోచనము కలుగుటకు ఆయన తన అద్వితియకుమారుని ఈ లోకానికి పంపాడు. ఈ లోకానికి వచ్చిన క్రీస్తు మనకు ఎన్నో భొధలు చేసి ఆ భొధలో దేవుని ప్రేమను చూపాడు. బైబిల్ లో మనము చూసి నట్లైతె ఎవరిని ఎలా ప్రేమించాలి అని క్రీస్తు పలికిన మాటలను పరిశిలించి నట్లైతే..... 1. శత్రువును ప్రేమించుడి: మత్తయి 5:43-45: ఇక్కడ క్రీస్తు పలికిన మాటలో నీ శత్రువులను ప్రేమించుడి, ప్రేమించడమే కాదు గాని వారికొరకు ప్రార్ధన చేయుడి... అని పలికిన క్రీస్తు మాటలోని భావము ప్రేమను పెంచేదిగా ఉంది. ఇలా మనము శత్రువులను ప్రేమించిన యెడల పరలోకమందు దేవునికి కుమారులుగా ఉంటాము. 2. నిస్వార్ధమైన ప్రేమ : 1కొరింధీ 12:4-8: మనకి పరలోకమందు ఉన్న తండ్రి ఒక్కడే, ఆయన ప్రేమామయుడు అలాగే క్రీస్తు మరియూ పరిషుద్దాత్మ కూడా ప్రేమమయులే.... అలాగే మనము కూడా పరిషుద్దాత్మను పొందుకున్నవారము గనుక ప్రేమామయులుగా ఉండాలి అన...
ప్రేమ ఈ మాటంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే మన జీవితం లో మనల్ని ప్రేమించే వారు, మనం ప్రేమించే వారు ఎవరో ఒకరు ఉంటారు. ప్రేమ ఈ రోజుల్లో చాల రకాల రంగులు పులుము కుంటుంది. తల్లి ప్రేమ , తండ్రి ప్రేమ , సహొదర ప్రేమ, ప్రేమికుల ప్రేమ, భార్య భర్తల ప్రేమ, పిల్లల ప్రేమ ఇలా రకరకాలు గ ప్రేమ ఈ రోజుల్లో చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. మనకి తెలిసిన స్వచ్చమైన కల్మషం లేని ప్రేమ ఎదన్న ఉంది అంటే అది తల్లి ప్రేమ అని నిర్మొహమాటంగా చెప్తాం. కాని తల్లి ప్రేమ బ్రతికి ఉన్నంత వరకే ఉంటుంది, చనిపోయాక ????? ఈ రోజుల్లో తల్లి ప్రేమ కూడా కలుషితమైపోతుంది... కాని నా జీవితం లో నేను ఒక అమితమైన, ఎన్నడు మారని, చెరుగని ప్రేమను చూసాను. తల్లి మరిచిన తండ్రి మరచిన నన్ను మరువనన్న ప్రేమ. కల్మషం లేనిదీ, శాశ్వతమైనది. అదే దేవునిప్రేమ. దేవుడు -- ప్రేమ ఏంటి? దేవుడు అంటే ప్రేమించే వాడు , ప్రేమిస్తూ ఉండే వాడు, ప్రేమను కనపరిచే వాడు. ఇది నిజం మనం తెలుసుకోలేక పోతున్న నిజం. కొంతమంది దేవుళ్ళు అని పిలవబడతారు వారు మనల్ని ప్రేమించినట్టు ఎక్కడ వ్రాయబ...
Comments
Post a Comment