"ఇదే నిజమైన ప్రేమ"
యోహను3:16 దేవుడు మనలను ఎంతగానొప్రేమించాడు ప్రేమించిన ఆయన ఆ ప్రేమను ఎలా చూపాడు? మనము స్వార్ధపురితమైన ఈ జీవితంలో ఎన్నోపాపలు చేస్తూ కాలం గడుపుతు దేవుని ఉగ్రతకు పాత్రులమైన మనలను తన యొద్దకు చెర్చుకొనుటకు మనకు పరలోకాన్ని అనుగ్రహించుటకును మనకు పాప వీమోచనము కలుగుటకు ఆయన తన అద్వితియకుమారుని ఈ లోకానికి పంపాడు. ఈ లోకానికి వచ్చిన క్రీస్తు మనకు ఎన్నో భొధలు చేసి ఆ భొధలో దేవుని ప్రేమను చూపాడు. బైబిల్ లో మనము చూసి నట్లైతె ఎవరిని ఎలా ప్రేమించాలి అని క్రీస్తు పలికిన మాటలను పరిశిలించి నట్లైతే..... 1. శత్రువును ప్రేమించుడి: మత్తయి 5:43-45: ఇక్కడ క్రీస్తు పలికిన మాటలో నీ శత్రువులను ప్రేమించుడి, ప్రేమించడమే కాదు గాని వారికొరకు ప్రార్ధన చేయుడి... అని పలికిన క్రీస్తు మాటలోని భావము ప్రేమను పెంచేదిగా ఉంది. ఇలా మనము శత్రువులను ప్రేమించిన యెడల పరలోకమందు దేవునికి కుమారులుగా ఉంటాము. 2. నిస్వార్ధమైన ప్రేమ : 1కొరింధీ 12:4-8: మనకి పరలోకమందు ఉన్న తండ్రి ఒక్కడే, ఆయన ప్రేమామయుడు అలాగే క్రీస్తు మరియూ పరిషుద్దాత్మ కూడా ప్రేమమయులే.... అలాగే మనము కూడా పరిషుద్దాత్మను పొందుకున్నవారము గనుక ప్రేమామయులుగా ఉండాలి అన...