Posts

Showing posts from 2015

"ఇదే నిజమైన ప్రేమ"

Image
యోహను3:16 దేవుడు మనలను ఎంతగానొప్రేమించాడు ప్రేమించిన ఆయన ఆ ప్రేమను ఎలా చూపాడు? మనము స్వార్ధపురితమైన ఈ జీవితంలో ఎన్నోపాపలు చేస్తూ కాలం గడుపుతు దేవుని ఉగ్రతకు పాత్రులమైన మనలను తన యొద్దకు చెర్చుకొనుటకు మనకు పరలోకాన్ని అనుగ్రహించుటకును మనకు పాప వీమోచనము కలుగుటకు ఆయన తన అద్వితియకుమారుని ఈ లోకానికి పంపాడు. ఈ లోకానికి వచ్చిన క్రీస్తు మనకు ఎన్నో భొధలు చేసి ఆ భొధలో దేవుని ప్రేమను చూపాడు. బైబిల్ లో మనము చూసి నట్లైతె ఎవరిని ఎలా ప్రేమించాలి అని క్రీస్తు పలికిన మాటలను పరిశిలించి నట్లైతే..... 1. శత్రువును ప్రేమించుడి: మత్తయి 5:43-45: ఇక్కడ క్రీస్తు పలికిన మాటలో నీ శత్రువులను ప్రేమించుడి, ప్రేమించడమే కాదు గాని వారికొరకు ప్రార్ధన చేయుడి... అని పలికిన క్రీస్తు మాటలోని భావము ప్రేమను పెంచేదిగా ఉంది. ఇలా మనము శత్రువులను ప్రేమించిన యెడల పరలోకమందు దేవునికి కుమారులుగా ఉంటాము. 2. నిస్వార్ధమైన ప్రేమ : 1కొరింధీ 12:4-8: మనకి పరలోకమందు ఉన్న తండ్రి ఒక్కడే, ఆయన ప్రేమామయుడు అలాగే క్రీస్తు మరియూ పరిషుద్దాత్మ కూడా ప్రేమమయులే.... అలాగే మనము కూడా పరిషుద్దాత్మను పొందుకున్నవారము గనుక ప్రేమామయులుగా ఉండాలి అన

సిలువ పై యేసు పలికిన మాటలకి వివరణ

Image
సిలువ పై యేసు పలికిన మాటలకి వివరణ :  1. మొదటి మాట:  తన తండ్రి యెహోవాతో    తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. (లూకా 23:34) క్షమాపణ ని సూచిస్తుంది.  ఆ మాట పలికిన సమయం లో ఎందరో సైనికులు, సేనాధిపతులు, పరిసయ్యులు, సద్ధుకయ్యలు ఉన్నరు. వీరంతా లోకస్తులకి సాదృశ్యం. వాళ్ళు మాటలతో యేసు ని దూషిస్తున్నారు, హేళన చేస్తున్నారు అయినప్పటకి యేసు వారిని క్షమించమని తండ్రి అయిన యెహోవ కు విజ్ఞాపన చేస్తున్నారు. మనం కూడా యేసు వలే మనల్ని దూషించిన వారి కోసం, అవమాన పరిచిన వారి కోసం ప్రార్ధించాలి అని నేర్పించటానికి యేసు ఈ మాట పలికెను. క్షమాపణ యేసు మాత్రమే చూపిన గుణం . అది మనం కలిగి ఉండాలి. 2. రెండవ మాట :  నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండుదువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. (లూకా 23:43) రక్షణ కి సాదృశ్యం.  ఈ మాట సిలువ లో యేసు కి ఎడమ వైపు ఉన్న దొంగ తో చెప్తున్న మాట. ఆ దొంగ యేసు ని దేవుడు అని విశ్వసించాడు. తను చేసిన పాపానికి తానికి పడిన శిక్ష సబబే అని తలచాడు . పాపాన్ని ఒప్పుకున్నాడు . కనుక యేసు ప్రభువు నీవు పరదేశి లో ఉంటావని చెప్పారు. దీనిని బట్టి మనం పాపులం

సిలువే కొలమానం

Image
దేవుడు చనిపోయిన రోజు ‘మంచి రోజు’ ఎలా అవుతుంది? మనిషి చనిపోతేనే అది విషాదం కదా, అటువంటిది దేవుని కుమారుడు చనిపోతే ఇంకెంత విషాదం! అలా మనం విషాదంలో మునిగిపోయిన రోజును గుడ్‌ఫ్రైడే అంటారేం? పైగా అది ఎలాంటి మరణం! యేసుక్రీస్తు కాళ్లలో చేతుల్లో మేకులు దిగ్గొట్టి, గాలిలో సిలువపై నిలబెట్టి, డొక్కల్లో బరిసెతో పొడిచి... భగవంతుడా, ఇలాంటి మరణం ఏ నరకంలోనైనా ఉంటుందా? ఎంత రక్తం! ఎంత యాతన! మనసు విలవిలలాడిపోతుంది. క్రీస్తు మనకోసం మరణించాడని, మానవాళి దోషాలను, పాపాలను సిలువపై ఎగసి చిమ్మిన తన రక్తంతో ప్రక్షాళన చేశాడని, అందుకోసం ఆయన తన ప్రాణాలనే త్యాగం చేశాడని.. తెలిసి, హృదయం మరింత విలపిస్తుంది. ‘‘తిరిగి జీవించడానికే ఆయన మరణించాడు కాబట్టి మానవాళికది గుడ్‌ఫ్రైడే’’ అనే మాటతో మనసు ఊరట చెందదు. ఎందుకంటే - మూడవరోజు పునరుత్థానం పొందినంత తేలిగ్గా ఆయన మరణం సంభవించలేదు. మరణానికి ముందు సిలువపై క్రీస్తు పడిన ‘కారుణ్య యాతన’ను, ఆ త్యాగాన్ని ‘సిలువ’తో తప్ప దేనితోనూ కొలవలేము. క్రీస్తు మరణించి, తిరిగి లేచిన నాటి నుంచి క్రైైస్తవులు సిలువను ధరించడాన్ని తమ ఆధ్యాత్మిక జీవితంలో ఒక ముఖ్య భాగంగా స్వీకరించారు. ఇక ఆయన ప