ప్రేమ
ప్రేమ ఈ మాటంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే మన జీవితం లో మనల్ని ప్రేమించే వారు, మనం ప్రేమించే వారు ఎవరో ఒకరు ఉంటారు. ప్రేమ ఈ రోజుల్లో చాల రకాల రంగులు పులుము కుంటుంది. తల్లి ప్రేమ , తండ్రి ప్రేమ , సహొదర ప్రేమ, ప్రేమికుల ప్రేమ, భార్య భర్తల ప్రేమ, పిల్లల ప్రేమ ఇలా రకరకాలు గ ప్రేమ ఈ రోజుల్లో చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. మనకి తెలిసిన స్వచ్చమైన కల్మషం లేని ప్రేమ ఎదన్న ఉంది అంటే అది తల్లి ప్రేమ అని నిర్మొహమాటంగా చెప్తాం. కాని తల్లి ప్రేమ బ్రతికి ఉన్నంత వరకే ఉంటుంది, చనిపోయాక ????? ఈ రోజుల్లో తల్లి ప్రేమ కూడా కలుషితమైపోతుంది... కాని నా జీవితం లో నేను ఒక అమితమైన, ఎన్నడు మారని, చెరుగని ప్రేమను చూసాను. తల్లి మరిచిన తండ్రి మరచిన నన్ను మరువనన్న ప్రేమ. కల్మషం లేనిదీ, శాశ్వతమైనది. అదే దేవునిప్రేమ. దేవుడు -- ప్రేమ ఏంటి? దేవుడు అంటే ప్రేమించే వాడు , ప్రేమిస్తూ ఉండే వాడు, ప్రేమను కనపరిచే వాడు. ఇది నిజం మనం తెలుసుకోలేక పోతున్న నిజం. కొంతమంది దేవుళ్ళు అని పిలవబడతారు వారు మనల్ని ప్రేమించినట్టు ఎక్కడ వ్రాయబ...