సిలువే కొలమానం
దేవుడు చనిపోయిన రోజు ‘మంచి రోజు’ ఎలా అవుతుంది? మనిషి చనిపోతేనే అది విషాదం కదా, అటువంటిది దేవుని కుమారుడు చనిపోతే ఇంకెంత విషాదం! అలా మనం విషాదంలో మునిగిపోయిన రోజును గుడ్‌ఫ్రైడే అంటారేం? పైగా అది ఎలాంటి మరణం! యేసుక్రీస్తు కాళ్లలో చేతుల్లో మేకులు దిగ్గొట్టి, గాలిలో సిలువపై నిలబెట్టి, డొక్కల్లో బరిసెతో పొడిచి... భగవంతుడా, ఇలాంటి మరణం ఏ నరకంలోనైనా ఉంటుందా? ఎంత రక్తం! ఎంత యాతన! మనసు విలవిలలాడిపోతుంది. క్రీస్తు మనకోసం మరణించాడని, మానవాళి దోషాలను, పాపాలను సిలువపై ఎగసి చిమ్మిన తన రక్తంతో ప్రక్షాళన చేశాడని, అందుకోసం ఆయన తన ప్రాణాలనే త్యాగం చేశాడని.. తెలిసి, హృదయం మరింత విలపిస్తుంది. ‘‘తిరిగి జీవించడానికే ఆయన మరణించాడు కాబట్టి మానవాళికది గుడ్‌ఫ్రైడే’’ అనే మాటతో మనసు ఊరట చెందదు. ఎందుకంటే - మూడవరోజు పునరుత్థానం పొందినంత తేలిగ్గా ఆయన మరణం సంభవించలేదు. మరణానికి ముందు సిలువపై క్రీస్తు పడిన ‘కారుణ్య యాతన’ను, ఆ త్యాగాన్ని ‘సిలువ’తో తప్ప దేనితోనూ కొలవలేము. క్రీస్తు మరణించి, తిరిగి లేచిన నాటి నుంచి క్రైైస్తవులు సిలువను ధరించడాన్ని తమ ఆధ్యాత్మిక జీవితంలో ఒక ముఖ్య భాగంగా స్వీకరించారు. ఇక ఆయన ప...